ఉత్తమ ఉద్యోగికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉద్యోగికి సన్మానం

Jan 27 2026 8:31 AM | Updated on Jan 27 2026 8:31 AM

ఉత్తమ

ఉత్తమ ఉద్యోగికి సన్మానం

శ్రీరాంపూర్‌: సింగరేణి ఉత్తమ ఉద్యోగిగా ఎంపికై న కంది సమ్మిరెడ్డిని సోమవారం కొత్తగూడెంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కంపెనీ సీఎండీ కృష్ణభాస్కర్‌ సన్మానించారు. ఆర్కే న్యూటెక్‌ గనిలో ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సమ్మిరెడ్డి ఎస్‌డీఎల్‌ ద్వారా రక్షణతో కూ డిన అధిక ఉత్పత్తికి కృషి చేయడంతో పాటు మెరుగైన మస్టర్లు కలిగి ఉండటంతో కంపెనీ ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్‌, ఇతర అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

రాష్ట్రపతి పతకానికి ఎంపిక

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ పి.వెంకటరాములు రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 2026 సంవత్సరానికిగానూ భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాబితాలో వెంకటరాములు చోటు దక్కించుకున్నారు. అసాధారణ సేవలకు గుర్తింపుగా లభించిన ఈ అత్యున్నత పురస్కారంపై బెటాలియన్‌ అధికారులు, సిబ్బంది వెంకటరాములును ప్రత్యేకంగా అభినందించారు.

నలుగురికి ఎకై ్సజ్‌ ఎస్సైలుగా పదోన్నతి

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో నలుగురికి ఎక్సైజ్‌ ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ అంజన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం.రాజేశ్వర్‌, ఆదిలాబాద్‌ డీపీఈఓ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అరుణ్‌ కుమార్‌, నిర్మల్‌ జిల్లా ఎకై ్సజ్‌ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బి.ముత్యం, కుమురంభీం ఆసిఫాబాద్‌ డీపీఈఓ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డి.రాజశేఖర్‌కు ఎకై ్సజ్‌ ఎస్సైలుగా పదోన్నతులు

లభించాయి.

ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం

బెల్లంపల్లి: మేడారం సమ్మక్క–సారలక్క జాతరకు భక్తులను సురక్షితంగా చేరవేయడం కోసం ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ తెలిపారు. సోమవారం బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద మేడారం జాతర బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా బెల్లంపల్లి బస్టాండ్‌ నుంచి 79 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, ఏసీపీ రవికుమార్‌, ఆర్టీసీ ఎండీ రాజశేఖర్‌, ఆసిఫాబాద్‌ ఆర్టీసీ బస్‌ డిపో అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉత్తమ ఉద్యోగికి సన్మానం1
1/2

ఉత్తమ ఉద్యోగికి సన్మానం

ఉత్తమ ఉద్యోగికి సన్మానం2
2/2

ఉత్తమ ఉద్యోగికి సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement