
సింగరేణి గిరిజన ఉద్యోగుల కమిటీ అధ్యక్షుడి ఎన్నిక
జైపూర్: సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా ధరావత్ పంతులానాయక్ ఎన్నికయ్యారు. గోదావరిఖనిలో గిరిజ న ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం11 ఏరియాల గిరిజన ఉద్యోగుల సమావేశం జరిగింది. ఇందులో ఎస్టీపీపీలో డీజీఎం డి.పంతులానాయక్‌ను సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఆయన ఇప్పటికే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పలువురు ఉద్యోగులు, అధికారులు పంతులు నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అధ్యక్షుడిగా ఎన్నికై న పంతులానాయక్