గురుకుల ఫలితాల్లో సత్తా చాటారు
జన్నారం: ఉత్తమ విద్యాబోధన, ఉత్తమ ఫలితాలతో జిల్లాలోనే పేరు తెచ్చుకున్న మండలంలోని అక్కపెల్లిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గురుకుల ఫలితాల్లోనూ సత్తా చాటింది. పాఠశాల నుంచి 13 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు జాజల శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో మొదటి స్థానం సాధించిన పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ను శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో యాదయ్య, ఎంఈవో విజయ్‌కుమార్ అభినందించారు. మండలంలోని రేండ్లగూడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు గురుకుల సీట్లు సాధించినట్లు హెచ్‌ఎం రాజన్న తెలిపారు. కలమడుగు వివేకానంద పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించినట్లు హెచ్‌ఎం సతీశ్‌గౌడ్ తెలిపారు.
భీమారం: మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన నిహాన్, పూజ గురుకుల పాఠశాలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం హరికృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.


