న్యాయం చేయాలని గంగపుత్రుల నిరసన
నిర్మల్‌చైన్‌గేట్: లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ డబ్ల్యూకు చెందిన గంగపుత్ర కులానికి చెందిన 10 కుటుంబాల వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కుల సంఘానికి సంబంధించిన లెక్కలు అడిగినందుకు సంఘం అధ్యక్షుడు పడగేల మహిపాల్ తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారన్నారు. గత పది నెలలుగా కలెక్టర్, ఎస్పీలను కలిసి సమస్య పరిష్కరించాలని కోరినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమస్య పరిష్కారానికి వచ్చిన పోలీసులు కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఇచ్చి కులంలో చేరాలని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు గైని మురళీమోహన్, హెచ్‌ఆర్సీ సంఘం అధ్యక్షుడు సురకంటి ఎల్లారెడ్డి, బాధిత గంగపుత్రులు పుట్టి భీమన్న, పుట్టి ఎర్రన్న ఉన్నారు.


