వాగాయితండాకు చేరిన పాదయాత్ర
ఇంద్రవెల్లి: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి దీక్ష భూమి నుంచి ప్రేమ్‌సింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న చేపట్టిన ఉమ్మడి జిల్లా సేవాలాల్ దీక్ష స్వాముల పాదయాత్ర సోమవారం సాయంత్రం ఇంద్రవెల్లి మండలంలోని వాగాయితండా గ్రామానికి చేరుకుంది. సుమారు నాలుగు వేలమంది స్వాములకు ఈశ్వర్‌నగర్, వాగాయితాండ గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి వాగాయితాండలో విశ్రాంతి తీసుకున్న స్వాములు మంగళవారం తెల్లవారు జామున పాదయాత్రగా బయలుదేరి ఏప్రిల్ 6న మహారాష్ట్రలోని పోరదేవి చేరుకొని శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొంటామని వారు తెలిపారు.


