నిర్మల్‌టౌన్: వికారా బాద్ జిల్లాలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో నిర్మల్‌కు చెందిన విద్యార్థిని హరిప్రియ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై ంది. శుక్రవారం బీహార్ రాష్ట్రంలో జరుగనున్న సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొననుంది. జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, నిర్మల్ సబ్ జూనియర్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ భూపతిరెడ్డి, ఇన్‌చార్జి ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బర్కుంట సునీల్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.
డీఎంహెచ్‌ఓ కార్యాలయ ఆవరణలో మంటలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయ ఆవరణలోని చెట్ల పొదల్లో గురువారం మంటలు చెలరేగాయి. గమనించిన కార్యాలయ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
బహిరంగ ప్రదేశాల్లో మద్యంసేవించిన ఇద్దరికి జరిమానా
ఆదిలాబాద్‌టౌన్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ఇద్దరికి ఆదిలాబాద్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గుండ రామస్వామి రూ.600 చొప్పున జరిమానా విధించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ తెలిపారు. గురువారం వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 25న రామ్‌లీలా మైదానంలో బండి సత్యనారాయణ, స్థానిక డైట్ కళాశాల మైదానంలో చించేరి వాడకు చెందిన సల్ల రవితేజ బహిరంగంగా మద్యం సేవించడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారించిన మేజిస్ట్రేట్ జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.


