
భారీగా నకిలీ విత్తనాల పట్టివేత
చింతలమానెపల్లి: మండలంలోని గూడెం వద్ద మహారాష్ట్రకు తరలిస్తున్న 70 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతా ప్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గూ డెం నుంచి మహారాష్ట్రకు నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు మంగళవా రం రాత్రి సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో గూడెం నుంచి మోటార్‌సైకిల్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను గమనించారు. తమ వద్ద ఉన్న సంచులను పడేసి పారిపోవడానికి ప్రయత్నించగా ఒకరు పోలీసులకు చిక్కారు. అనంతరం విచారించగా పట్టుబడిన వ్యక్తి మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన చాపిలె వినోద్‌గా గుర్తించారు. పారిపోయిన వారు గంగాపూర్ గ్రామానికి చెందిన చాపిలె పురుషోత్తం, సిర్పూర్(టి) మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన బొల్లబోయిన అశోక్, బొల్లబోయిన కృష్ణగా నిర్ధారించారు. పట్టుబడిన చా పిలె వినోద్‌ను చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్‌కు త రలించి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. చాపిలె వినోద్, మిగతా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాల ధర సుమారు రూ.1.50లక్షలు ఉంటుందని వివరించా రు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సై వెంకటేశ్, పోలీస్ సిబ్బంది మధు, రమేశ్, సంజీవ్ పాల్గొన్నారు.