కోడ్‌ కూయక ముందే సరిహద్దులో తనిఖీ కేంద్రాలు.. | - | Sakshi
Sakshi News home page

కోడ్‌ కూయక ముందే సరిహద్దులో తనిఖీ కేంద్రాలు..

Oct 9 2023 1:38 AM | Updated on Oct 9 2023 10:55 AM

- - Sakshi

గూడెం వద్ద పోలీసుల తనిఖీలు..

మంచిర్యాల : రానున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేదుకు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల కోసం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. జిల్లా సరి హ ద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. మంచిర్యాల–జగిత్యాల, జిల్లాల సరిహ ద్దు ప్రాంతమైన దండేపల్లి మండలం గూడెం అటవీ చెక్‌పోస్టు వద్ద, దండేపల్లి పోలీసులు తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. వచ్చి పోయే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.

అక్రమ మద్యం, డబ్బు, ఓటర్లను ప్రలోభ పె ట్టేందుకు తరలించే వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టి, తనిఖీలు ముమ్మరం చేశారు. గతంలో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారీ మాత్రం ముందుగానే తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement