మహబూబ్‌నగర్‌ | - | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌

Oct 24 2026 12:40 AM | Updated on Oct 24 2026 12:40 AM

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 24 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

పాలమూరులో క్యాన్సర్‌ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. జన్యుపరమైన లోపాలతో పాటు మారుతున్న జీవనశైలి, అలవాట్లు, పర్యావరణ ప్రభావం కేన్సర్‌ ముప్పును పెంచుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 1,723 మంది క్యాన్సర్‌ బాధితులు వివిధ దశల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ– అసంక్రమిత వ్యాధులు) విభాగం నిర్వహించిన సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

● మహబూబ్‌నగర్‌ జిల్లాలో గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్లు పోనూ తల, మెడకు సంబంధించి 29 మంది క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా గట్‌ (పేగు) క్యాన్సర్‌ బాధితులు 20 మంది వరకు ఉన్నారు. లుకేమియా కేన్సర్‌ బారిన పడిన వారు 11 మంది వరకు ఉన్నట్లు ఎన్‌సీడీ సర్వేలో తేలింది.

వనపర్తి ఫస్ట్‌.. నాగర్‌కర్నూల్‌ సెకండ్‌

ఉమ్మడి జిల్లాలో నమోదైన క్యాన్సర్‌ బాధితుల గణాంకాలను పరిశీలిస్తే వనపర్తి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నమోదైన మొత్తం కేసుల్లో 23.68 శాతం మంది బాధితులు ఈ జిల్లాలోనే ఉన్నారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లా 23.27 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలు 20.84 శాతం చొప్పున మూడు, నాలుగో స్థానంలో ఉండగా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యల్పంగా 11.38 శాతం మంది క్యాన్సర్‌ బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.

మహిళలే అధికం..

ఎన్‌సీడీ సర్వే ప్రకారం ఉమ్మడి పాలమూరులో నమోదైన మొత్తం క్యాన్సర్‌ బాధితుల్లో మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా గర్భాశయ ముఖద్వారం (సర్వైకల్‌), రొమ్ము (బ్రెస్ట్‌) క్యాన్సర్‌ బారిన పడ్డవారే 972 మంది ఉన్నారు. సర్వేలో నమోదైన మొత్తం బాధితులతో పోలిస్తే 56.41 శాతం మంది మహిళలు క్యాన్సర్‌ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.

సామాన్యులే టార్గెట్‌!

అధిక వడ్డీ ఆశజూపి సామాన్యుల సొమ్మును కొల్లగొడుతున్న మోసగాళ్లు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెచ్చిపోతున్నారు.

–8లో u

వనపర్తిలో అత్యధికంగా 408, గద్వాలలో అత్యల్పంగా 196 కేసులు

అన్ని జిల్లాల్లోనూ మహిళలే అధికం.. ఎక్కువగా రొమ్ము, అండాశయానికి సంబంధించినవే..

ఎన్‌సీడీ సర్వేలో బహిర్గతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement