సంకీర్తన వారోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సంకీర్తన వారోత్సవాలు ప్రారంభం

Oct 24 2026 12:40 AM | Updated on Oct 24 2026 12:40 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: శ్రీ అన్నమయ్య వాణి లలితా సంగీత విద్యాలయం వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గాయకులు గద్వాల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ పద్మవతీకాలనీలో శ్రీవనమాలి పాదపద కవితా తాతసంకీర్తనా షష్టమ వారోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ పొన్నాడ సుబ్రమణ్యప్రసాద్‌, సామవేదం వెంకట మురళీకృష్ణ, పద్మనాభాచార్యులు, లోగడ సుబ్రమణ్యంహాజరయ్యారు. అనంతరం గద్వాల చంద్రశేఖరరావు నిర్వహించిన అన్నమయ్య సంకీర్తన కచేరీ అలరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఐదుసార్లు శ్రీవనమాలి పాదపద కవితా తాత సంకీర్తన వారోత్సవాలను ఘనంగా నిర్వహించామని, ఈసారి కూడా అదే తరహాలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటల నుంచి 10 గంటల వరకు సంకీర్తన కచేరీ ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.

మద్దతు ధర కంటే రూ.వెయ్యి అధికం

దేవరకద్ర: స్థానికమార్కెట్‌ యార్డులో వానాకాలం ధాన్యం సీజన్‌ ప్రారంభమైంది. వరి పంటలు కోత దశకు చేరుకోవడంతో రైతులు కోసిన ధాన్యాన్ని నేరుగా మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. శుక్రవారం ఈనామ్‌ టెండర్ల ద్వారా అధికారులు ధరలను ప్రకటించారు. మార్కెట్‌కు వచ్చిన కేఎన్‌ఎం రకం ధాన్యానికి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.3,519, కనిష్టంగా రూ.3,414 ధర లభించింది. ఆర్‌ఎన్‌ఆర్‌ రకానికి గరిష్టంగా రూ.3,523, కనిష్టంగా రూ.3,471 ధరలు నమోదయ్యాయి. గత ఏడాది ప్రకటించిన ప్రభుత్వ కనీస మద్దతు ధరతో పోలిస్తే క్వింటాల్‌కు దాదాపు రూ.వెయ్యి వరకు అధికంగా ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సాధారణంగా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండగా, మార్కెట్‌ యార్డులో కోతల నుంచి వచ్చిన ధాన్యాన్ని నేరుగా విక్రయించే అవకాశం ఉండటం రైతులకు వెసులుబాటుగా మారింది. శుక్రవారం మార్కెట్‌కు సుమారు 500 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

ఉద్దాల తయారీదారులకు చెక్కుల అందజేత

చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉద్దాలు, చాట, తలియ కుండ తయారీదారులకు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో చెక్కులు అందజేశారు. ఆలయ చైర్మన్‌ బత్తుల బాల్‌రాజు, ఈవో మధనేశ్వర్‌రెడ్డి తయారీదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాల ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి నిర్ణీత సమయంలో ఉద్దాలు, చాట, తలియ కుండలను భక్తిశ్రద్ధలతో తయారు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement