టీజీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

టీజీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Oct 24 2026 12:40 AM | Updated on Oct 24 2026 12:40 AM

● కలెక్టర్‌ ఖుష్బూగుప్తా

● పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అడిషనల్‌ కలెక్టర్‌, ఎస్పీ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే అసిస్టెంట్‌ సైంటిస్ట్‌ అనలిస్ట్‌ గ్రేడ్‌–2, అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ పోస్టుల కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంచనీ య ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 24న అసిస్టెంట్‌ సైంటిస్ట్‌ అనలిస్ట్‌ గ్రేడ్‌–2, 26న అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా పరిధిలోని రెండు కేంద్రాల్లో మొత్తం 640 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ధర్మాపూర్‌లోని జయప్రకాష్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (జేపీఎన్‌సీఈ), క్రిస్టియన్‌పల్లిలోని ఎంఎస్‌ఎస్‌ ఇన్ఫోటెక్‌ ఫాతిమా విద్యాలయంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, నిరంతర విద్యుత్‌ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అభ్యర్థులకు రవాణా ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించవద్దని స్పష్టం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ హరిప్రియ, ఎస్పీ డి.జానకి శుక్రవారం రెండు పరీక్ష కేంద్రాలను సందర్శించి సాంకేతిక, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

అభ్యర్థులకు సూచనలు

ఉదయం సెషన్‌కు హాజరయ్యేవారిని ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌కు హాజరయ్యేవారిని మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. గేట్లు మూసిన తర్వాత ప్రవేశం ఉండదని కలెక్టర్‌ తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లోని కేంద్రాన్ని ముందుగానే నిర్ధారించుకుని సమయానికి చేరుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement