కేజీబీవీ ఎస్‌ఓలకు షోకాజ్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ ఎస్‌ఓలకు షోకాజ్‌ నోటీసులు

Oct 24 2026 12:40 AM | Updated on Oct 24 2026 12:40 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాలోని నాలుగు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ప్రత్యేక అధికారులకు (ఎస్‌ఓ) డీఈఓ విజయకుమారి శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. భూత్పూర్‌ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల సంఖ్య, భోజన మెనూ అమలులో లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భూత్పూర్‌ కేజీబీవీలో కేవలం ఆరుగురు విద్యార్థులే ఉండటం, సీఆర్టీలు సకాలంలో విధులకు హాజరుకాకపోవడంపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో పాటు సాయంత్రం స్నాక్స్‌ కూడా పెట్టకపోవడాన్ని గుర్తించారు. ఈ కారణాలతో ఎస్‌ఓ ప్రశాంతికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. మహమ్మదాబాద్‌, మిడ్జిల్‌, మహబూబ్‌నగర్‌ రూరల్‌ కేజీబీవీల్లోనూ విద్యార్థుల హాజరు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో సున్నాగా నమోదవడంపై డీఈఓ వివరణ కోరారు. విద్యార్థుల హాజరు నమోదు కాకపోవడానికి కారణాలేమిటో తెలియజేయాలని ఆయా పాఠశాలల ఎస్‌ఓలకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్నవారు మూడు రోజుల్లోగా వివరణ సమర్పించాలని డీఈఓ ఆదేశించారు. వివరణలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నాలుగు పాఠశాలల్లో

నిర్లక్ష్యంపై డీఈఓ ఆగ్రహం

భూత్పూర్‌ కేజీబీవీలో

ఆరుగురే విద్యార్థులు..

మెనూ అమలులోనూ లోపాలు

మరో మూడు పాఠశాలల్లో జీరో అటెండెన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement