పోలీసులపై దాడి కేసులో సర్పంచు భర్త అరెస్టు | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై దాడి కేసులో సర్పంచు భర్త అరెస్టు

Mar 1 2026 8:16 AM | Updated on Mar 1 2026 8:16 AM

పోలీసులపై దాడి కేసులో సర్పంచు భర్త అరెస్టు

పోలీసులపై దాడి కేసులో సర్పంచు భర్త అరెస్టు

చిన్నచింతకుంట: కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి సర్పంచు స్వర్ణమ్మ భర్త మాజీ ఎంపీటీసీ, బీఆర్‌ఎస్‌ నాయకుడు మనోహర్‌రెడ్డిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది డిసెంబర్‌ 15న పెద్దవడ్డేమాన్‌ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పంపల్లికి చెందిన యువకుడు మధుకుమార్‌ మృతి చెందాడు. మధుకుమార్‌ మృతికి జడ్చర్ల పట్టణానికి చెందిన బొలోరో డ్రైవర్‌ గోపాల్‌నాయక్‌ కారణమంటూ ఘటనా స్థలంలో తన అనుచరులతో నిరసన చేపట్టి బొలోరో డ్రైవర్‌పై దాడికి దిగాడు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన చిన్నచింతకుంట ఏఎస్‌ఐ వెంకటస్వామి, పీసీ నిరంజన్‌రెడ్డిపై ఆయన అనుచరులతో దాడిచేశారు. అదే రోజు ఏఎస్‌ఐ వెంకటస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శనివారం అప్పంపల్లిలోని ఆయన నివాసంలో అరెస్టు చేసి జడ్చర్ల కోర్టు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement