సీఎం కప్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

సీఎం కప్‌ సందడి

Feb 22 2026 8:30 AM | Updated on Feb 22 2026 8:30 AM

సీఎం

సీఎం కప్‌ సందడి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఉమ్మడి జిల్లాలో సీఎం కప్‌ క్రీడల సందడి నెలకొంది. మక్తల్‌లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు, మహబూబ్‌నగర్‌లో నెట్‌బాల్‌ పోటీలు కొనసాగుతుండగా.. బాక్సింగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయి సీఎం కప్‌ బాక్సింగ్‌, నెట్‌బాల్‌ పోటీలు శనివారం రెండో రోజుకు చేరాయి.

● రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో బాల బాలికలకు ఎనిమిది కేటగిరిల్లో పోటీలు నిర్వహించారు. 44–4 6కేజీల బాలురలో సయ్యద్‌ అబ్దుల్‌ అహ్మద్‌ హాష్మి–బంగారు (హైదరాబాద్‌), రాహుల్‌ గణేష్‌–వెండి (భద్రాద్రి కొత్తగూడెం), రాంచరణ్‌–హన్మకొండ, మణికౌషిక్‌–మహబూబ్‌నగర్‌ కాంస్యం, 46–48 కేజీలో శ్రేయాస్‌–బంగారు (హైదరాబాద్‌), కార్తీక్‌–వెండి (రంగారెడ్డి), రాంచరణ్‌–జనగాం, రిశాంత్‌–మంచిర్యాల, 48–50కేజీలో మహ్మద్‌ బర్కత్‌అలీ–బంగారు (హైదరాబాద్‌), సూరజ్‌సింగ్‌–వెండి (మేడ్చల్‌), కార్తీకేయ–జగిత్యాల, ఇంతియాజ్‌–సంగారెడ్డి కాంస్యం, 50–52కేజీలో విఘ్నేష్‌–బంగారు (హైదరాబాద్‌), మాజ్‌ బిన్‌ సయీద్‌–వెండి (నిజామాబాద్‌), పవన్‌–సిద్దిపేట, ఉబేద్‌ఖాన్‌–మంచిర్యాల కాంస్యం, 52–54కేజీలో మిర్జాఅలీబేగ్‌–బంగారు (హైదరాబాద్‌), మహ్మద్‌ సమద్‌–వెండి (మెదక్‌), ఎండి.రియాన్‌–కరీంనగర్‌, రాకేష్‌–సిద్దిపేట కాంస్యం, 54–57కేజీలో గుణకర్‌–బంగారు (నల్గొండ), విశ్వేష్‌–వెండి (ఖమ్మం), మురళికృష్ణ–సిద్దిపేట, యశ్వంత్‌–ఆసిఫాబాద్‌ కాంస్య,60–63కేజీలో రాంచరణ్‌–బంగారు (మేడ్చల్‌), సుకుమార్‌–వెండి (కరీంనగర్‌), వీరభద్రేష్‌–సంగారెడ్డి, జునైద్‌–హన్మకొండ కాంస్య పతకాలు సాధించారు.

● బాలికల బాక్సింగ్‌లో 44–46కేజీల విభాగంలో కేఆర్‌కె.వర్షిణి–బంగారు (హైదరాబాద్‌), అయేషాబేగం–వెండి (మేడ్చల్‌), అనన్య–నిర్మల్‌, శ్రేష్ఠ–ఆసిఫాబాద్‌ కాంస్య పతకాలు, 46–48కేజీలో రమావత్‌ స్వితేజ–బంగారు (కామారెడ్డి), సుమైయ కుల్సుమ్‌–రజతం (నిజామాబాద్‌), అక్షరదీపిక–జనగాం, హర్షిత–అసిఫాబాద్‌ కాంస్య పతకాలు, 48–50కేజీలో నిహారిక–బంగారు (నిజామాబాద్‌), మధులత–రజతం (మహబూబ్‌నగర్‌), కీర్తన–నిర్మల్‌, అపూర్వ–హైదరాబాద్‌ కాంస్యం, 50–52కేజీలో క్రితి అగర్వాల్‌–బంగారు (మేడ్చల్‌), లతషాన–రజతం (మేడ్చల్‌), అనూష్‌–మహబూబ్‌నగర్‌, శ్రీలక్ష్మి–జనగాం కాంస్య, 52–54కేజీలో ఎన్‌.ప్రిని–బంగారు (హన్మకొండ), బానోత్‌ రూప–వెండి (ఖమ్మం), సుక్షిత–హైదరాబాద్‌, సాయి ప్రణీత–మేడ్చల్‌ కాంస్యం, 57–60కేజీల శరణ్‌ రోజి–బంగారు (వరంగల్‌), వి.అక్షిత–వెండి (పెద్దపల్లి), అఫిషిన్‌ బుషిరా–నల్గొండ, చరిష్మా–జనగాం కాంస్య పతకాలు సాధించారు.

ప్రిక్వార్టర్‌కు చేరిన మహబూబ్‌నగర్‌ జట్లు

రాష్ట్రస్థాయి సీఎంకప్‌ నెట్‌బాల్‌ పోటీల్లో ఆతిథ్య మహబూబ్‌నగర్‌ బాలబాలికల జట్లు వరుసగా మూడేసి మ్యాచ్‌లను గెలుపొంది ప్రీక్వార్టర్‌కు చేరాయి. బాలుర విభాగంలో నారాయణపేట, హైదరాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మేడ్చల్‌, మంచిర్యాల, వరంగల్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జట్లు ప్రిక్వార్టర్‌లో స్థానం దక్కించుకున్నాయి.

మహబూబ్‌నగర్‌, మక్తల్‌లో జోరుగాకొనసాగుతున్న నెట్‌బాల్‌, కబడ్డీ రాష్ట్రస్థాయి క్రీడలు

పాలమూరులో ముగిసిన బాక్సింగ్‌ పోటీలు

క్రీడాకారుల ప్రతిభకు వేదిక సీఎం కప్‌: ఏపీ జితేందర్‌రెడ్డి

సీఎం కప్‌ సందడి1
1/1

సీఎం కప్‌ సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement