చెట్టును ఢీకొట్టి వాహనదారుడి మృతి
రాజోళి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శాంతిగనర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మానవపాడు మండలం మద్దూరుకు చెందిన హరిజన నాగరాజు (37) బైక్‌పై శుక్రవారం రాత్రి అమరవాయి నుంచి కలుకుంట్లకు బయలుదేరాడు. ఈ క్రమంలో బైక్‌ను అతివేగంగా నడుపుతూ రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొట్టాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి 108 ద్వారా కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. పరి స్థితి విషమించడంతో శనివారం మృతి చెందా డు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు.
రైలు కింద పడి బలవన్మరణం
జడ్చర్ల: రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్‌ఐ రాజు కథనం మేరకు.. బాదేపల్లి పాతబజార్‌కు చెందిన సుంకసారి శ్యామ్ (36) హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే వివాహమై 14 ఏళ్లు గడిచినా సంతానం కలుగకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నెల రోజుల క్రితం భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఒంటరితనాన్ని భరించలేక రాయచూర్ డెమో ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుటుంబకలహాలతోవ్యక్తి ఆత్మహత్య
నవాబుపేట: మండల పరిధిలోని కాకర్లపహడ్ గ్రామంలో కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బొప్పటి రమేష్ (32) ఇటీవల భార్యతో గొడవపడ్డాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మనస్థాపానికి గురై శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
ఉరి వేసుకొని యువకుడి బలవన్మరణం
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలో ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డి (22) తల్లితో కలిసి కల్వకుర్తిలో నివాసం ఉంటున్నాడు. తల్లి బంధువుల పెళ్లికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని సాయినాథ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
చెట్టును ఢీకొట్టి వాహనదారుడి మృతి


