కారు, బైక్ ఢీ: ఒకరు మృతి
దేవరకద్ర రూరల్: కారు, బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొక యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం పట్టణంలోని ఆర్వోబీపై చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చౌదర్‌పల్లికి చెందిన వెంకటేష్, నర్సింహులు (20) స్నేహితులు కాగా పని నిమిత్తం శనివారం బైక్‌పై దేవరకద్రకు వెళ్లారు. పని ముగియగానే తిరిగి స్వగ్రామానికి వస్తుండగా పట్టణంలోని ఆర్వోబీపై లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నర్సింహులు చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


