మార్కెట్‌లోకి మారుతీ ఈ–విటారా ఎలక్ట్రిక్‌ కారు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి మారుతీ ఈ–విటారా ఎలక్ట్రిక్‌ కారు

Feb 22 2026 8:30 AM | Updated on Feb 22 2026 8:30 AM

మార్కెట్‌లోకి మారుతీ ఈ–విటారా ఎలక్ట్రిక్‌ కారు

మార్కెట్‌లోకి మారుతీ ఈ–విటారా ఎలక్ట్రిక్‌ కారు

పాలమూరు: వాయు కాలుష్యం కట్టడికి, పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రికల్‌ కార్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నగరంలోని బైపాస్‌ రోడ్‌లో ఉన్న శ్రీజయరామ మోటార్స్‌ నెక్సా షోరూంలో శనివారం నూతనంగా మార్కెట్‌లోకి వచ్చిన మారుతీ విటారా ఎలక్ట్రిక్‌ కారును ఎమ్మెల్యేతో పాటు మేయర్‌ మమత శ్రీనివాస్‌ మార్కెట్‌లోకి విడుదల చేశారు. అనంత రం ఎమ్మెల్యే మాట్లాడుతూ వాయు కాలుష్యం, ఇంధన వ్యయం, గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ఎంతో కీలకమన్నారు. శ్రీరామ జయరామ మోటార్స్‌ ఎండీ బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ నూ తనంగా వచ్చిన ఈ ఎలక్ట్రిక్‌ కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌, పది ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా ఫాస్ట్‌ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ ఉంటుందన్నారు. కారు ఎక్స్‌ షోరూం ధర రూ.10.99 లక్షలతో మొదలవుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement