వైస్‌చాన్స్‌లర్ల మీట్‌కు వీసీ శ్రీనివాస్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉస్మానియా యూనివర్సిటీలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ చాన్స్‌లర్ల మీట్‌కు పీయూ వీసీ శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఐఏ అండ్ క్వాంటమ్ ఎనబిల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ అనే అంశంపై చర్చ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవవర్మతో పాటు తెలంగాణ యూనివర్సిటీ వీసీలు పాల్గొన్నారు.
సర్వే అధికారుల మాయాజాలం
గట్టు: భారత్‌మాల రోడ్డు నిర్మాణంలో తన పేరున ఉన్న భూమిని ప్రభుత్వం సేకరించికపోయినా.. పోయినట్లుగా చూపించి, నష్టపరిహారం చెల్లించకుండా రికార్డుల్లో తన పేరుపై ఉన్న భూమిని తొలగించారంటూ ఆరగిద్దకు చెందిన రైతు కుర్వ వెంకటేష్ శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశాడు. ఆరగిద్ద గ్రామానికి చెందిన రైతులు కుర్వ రాముడు, కుర్వ జమ్మన్న, కుర్వ వెంకటేష్ అన్నదమ్ములు. వీరికి సర్వే నంబర్ 142 లో భూములు ఉన్నాయి. అయితే ఇదే సర్వే నంబర్‌లో కుర్వ రాముడు, కుర్వ జమ్మన్నలకు చెందిన భూములను మాత్రమే రోడ్డు నిర్మాణానికి సేకరించారు. కుర్వ వెంకటేష్‌కు చెందిన భూమిని సేకరించలేదు. అయితే 142లో కుర్వ వెంకటేష్‌కు చెందిన 30 గుంటల భూమిని భారత్‌మాల రోడ్డు నిర్మాణంలో సేకరించినట్లుగా రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. అయితే తన పేరున ఉన్న భూమి రోడ్డు నిర్మాణంలో సేకరించకుండా, నష్టపరిహారం చెల్లించకుండానే రెవెన్యూ రికార్డుల్లో ఎలా తొలగిస్తారని రైతు కుర్వ వెంకటేష్ వాపోయారు. ఏడాది కాలంగా ఇటు తహసీల్దార్ కార్యాలయంతో పాటుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ, ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని రైతు కోరారు.
● రోడ్డు నిర్మాణంలో భూమి పోకున్నా.. పోయినట్లుగా రెవెన్యూ రికార్డుల్లో తొలగింపు
● న్యాయం చేయాలని ఆరగిద్ద రైతు విజ్ఞప్తి
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన
వైస్‌చాన్స్‌లర్ల మీట్‌కు వీసీ శ్రీనివాస్


