ఇంటివద్దకే మేడారం బంగారం ప్రసాదం
స్టేషన్ మహబూబ్‌నగర్: ములుగు జిల్లాలో ఈనెల 28వ తేదీ నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేడా రం వెళ్లలేని భక్తులకు ఇంటివద్దకే అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా అందజేయనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ తెలిపారు. ఆర్‌ఎం కార్యాలయంలో టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ మేడా రం కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. భక్తులు రూ.299 చెల్లిస్తే దేవాదాయశాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయడం జరుగుతుందన్నారు. భక్తులు www. tgsrtclogistics.co.in వెబ్‌సైట్ లాగిన్ ద్వా రా లేదా సమీపంలోని టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు లక్ష్మిధర్మ, కవిత, టీజీఎస్‌ఆర్టీసీలాజిస్టిక్ ఉద్యోగులు పాల్గొన్నారు.
కందుల ధర రూ. 6620
దేవరకద్ర/ కల్వకుర్తి రూరల్: దేవరకద్ర మార్కెట్ యార్డులో శనివారం జరిగిన టెండర్లలో కందుల ధర క్వింటాల్ రూ.6,620గా ఒకే ధర లభించంది. ఆముదాలు రూ.5,800 పలికింది. సీజన్ ముగియడంతో వరి ధాన్యం మార్కెట్‌కు రావడంలేదు. కేవలం కందులు, ఆముదాలు కొద్ది మొత్తంలో అమ్మకానికి వచ్చాయి.
● కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు 149 మంది రైతులు 4,758 బస్తాలలో 1,429 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి తీసుకువచ్చారని కార్యదర్శి శివరాజు తెలిపారు. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.9,010, కనిష్టంగా రూ.6,802 ధర పలకగా.. సరాసరిగా రూ.8,500 లభించిందని ఆయన చెప్పారు. మార్కెట్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
చట్టాలపై అవగాహన
పాలమూరు: నగరంలోని టచ్ అనాథ శరణాలయం, సన్నిధి చిల్డ్రన్ హోమ్‌లను శనివారం న్యాయమూర్తులు మమతారెడ్డి, డి.ఇందిరలు సందర్శించారు. స్థానికంగా ఉన్న వసతులు, సదుపాయాలు, ఆహారం, తాగునీరు వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం బాల్య వివాహాల జరిగే అనర్థాలను వివరించారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. చిన్నతనం నుంచే అందరూ చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు.
జోగుళాంబ ఆలయాల్లో ముగిసిన శుద్ధి
అలంపూర్: అమ్మవారి వార్షికోత్సవంలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వాములు జోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని, ప్రాంగణంలో ఉన్న విగ్రహాలు, అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. దీంతో కొన్ని గంటల పాటు భక్తులకు దర్శనాలకు అనుమతించలేదు. సాయంత్రం శుద్ధి అనంతరం జోగుళాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. యథాతథంగా దర్శనాలకు అనుమతించారు.
డీఎంఆర్‌ఎం ట్రస్ట్ సేవలు అభినందనీయం
అమరచింత: డీఎంఆర్‌ఎం ట్రస్ట్ సేవలు అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తులు మాధవిదేవి, అనిల్‌కుమార్ జూకంటి అన్నారు. శనివారం మక్తల్‌లో కోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో అమరచింతలోని మాజీ అడ్వొకేట్ జనరల్, హైకోర్టు న్యాయవాది దేశాయి ప్రకాష్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి పుట్టిన ఊరి కోసం చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకొని అభినందించారు. యువత, ప్రజలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే గ్రామాలు అన్నింటా అభివృద్ధి సాధిస్తాయన్నారు. వీరి వెంట నారాయణపేట జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు ఉన్నారు.
ఇంటివద్దకే మేడారం బంగారం ప్రసాదం
ఇంటివద్దకే మేడారం బంగారం ప్రసాదం


