మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
మానవపాడు: పెళ్లి నిశ్చయమై.. పెళ్లి జరగక పోవ డంతో మనస్తాపానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగిన ఘటన మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ స్వాతి తెలిపిన కథనం ప్రకారం.. మానవపాడుకు చెందిన వ సంత్ కల్యాణ్‌రెడ్డి(33) మూడునెలల కిందట మానవపాడుకు చెందిన అమ్మాయితో పెళ్లి ని శ్చయమైంది. 15వ తేదీన పెళ్లి చేయాలని ఇంట్లోని కుటుంబ సభ్యులు అనుకోగా.. పెళ్లి జరుగకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లోని బెడ్‌రూమ్‌లో గురువారం పురు గుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి ఈశ్వరమ్మ గ్రామంలోని ఆలయంలో పూజా కార్యక్రమాలు చేసి ఇంటికి వచ్చే సమయానికి యువకుడి నోట్ల నురగ వస్తుండగా వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యసిబ్బంది పరీక్షించి అప్పటికే మరణించాడని తెలిపారు. తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
నది స్నానానికి వెళ్లి
యువకుడి మృతి
కృష్ణా: సంక్రాతి కనుమ సందర్భంగా కృష్ణానదిలో స్నానం ఆచరిస్తే తమకు మేలు జరుగుతుందని భావించి శుక్రవారం నదిలో స్నానానికి యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తాండూర్ పట్టణానికి చెందిన ప్రీతమ్ (12)తన తల్లిదండ్రులైన మహేశ్, శాంతమ్మతో కలిసి తన చిన్నమ్మ ఉంటున్న కృష్ణా మండలంలోని గుడెబల్లూర్ పంచాయతీ టైరోడ్‌కు రెండు రోజుల క్రితం వచ్చాడు. శుక్రవారం కనుమ సందర్భగా నదిస్నానం చేయుటకు ఆ యువకుడితోపాటు కొందరు నదిలోకి వెళ్లారు. ఈ సమయంలో నదిలోని పెద్ద మడుగును గుర్తించక యువకుడి అందులోకి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర దుఖంలో మునిగిపోయింది. ఈ ఘటనపై కృష్ణా ఎస్‌ఐ ఎస్‌ఎం నవీద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటూర్ ఉపసర్పంచ్ హ ఠాన్మరణ ం
నవాబుపేట: సంక్రాంతి పండగ వేళ ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మండలంలోని ఇప్పటూర్‌కు చెందిన ఉపసర్పంచ్ సు రేందర్(42) గురు వారం గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. కాగా సురేందర్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు స భ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఆయన నెలరోజులపాటు బాధ్యతలో ఉండి అంతలోనే మృతిచెందాడు.
● ఇప్పటూర్ ఉపసర్పంచ్ సురేందర్ మృతి వార్త తెలియగానే గురువారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. తనకు గ్రామంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న సురేందర్ లేనిలోటు తీర్చలేనిదని పేర్కొన్నాడు. అలాగే కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి అండగా ఉంటానని బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు. ఆయన వెంట ఇప్పటూర్ సర్పంచ్ రవికిరణ్ మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
కోయిల్‌సాగర్‌లో
నీటిమట్టం 29 అడుగులు
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం శుక్రవారం సాయంత్రం 29 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32.6 అడుగులుగా ఉంది. యాసంగి పంటల సాగుకు ఈ నెల 5వ తేదీన మొదటి విడత కింద కుడి, ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. 14వ తేదీ వరకు పది రోజుల పాటు నీటి విడుదలను కొనసాగించారు. గురువారం నుంచి ప్రాజెక్టు కాల్వలను మూసివేశారు. నీటి విడుదల చేసిన రోజు 32.2 అడుగులుగా ఉన్న నీటి మట్టం ఒక తడి వదిలిన తరువాత 3.2 అడుగుల మేర తగ్గింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండో తడి కింద ఈనెల 30 నుంచి నీటిని విడుదల చేస్తారు.
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య


