నయనానందం.. ప్రభోత్సవం
అచ్చంపేట: మండలంలోని భ్రమరాంబ దేవాలయంలో గురువారం రాత్రి 8.30 గంటలకు ప్రభ ఉత్సవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి 3 గంటల వరకు పట్టణంలో ఊరేగించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణలు ప్రత్యే క పూజలు చేశారు. శేషావాహనంపై పార్వతీ పరమేశ్వరులను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. బాణాసంచా పేల్చుతూ, మంగళ వాయిద్యాలు, అప్పా శివ ఆధ్వర్యంలో జరిగే వీరభద్ర సేవ పురంతులతో ఊరేగింపుగా ప్రభను మహా వైభవంగా తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి బయలు దేరిన ప్రభ ఉత్సవం ఉమామహేశ్వరం కొండ కింద ఉన్న భోగ మహేశ్వరానికి శుక్రవారం తెల్లవారుజామున చేరుకుంది.
హగోరా వీరదాసి
వీరదాసి మూడో కన్ను నుంచి మంటలు తీయ టం భక్తులను ఆకట్టుకుంది. ప్రభోత్సవంలో వీర దాసి రావడగం ప్రత్యేకత చాటుకుంది. బడ్రమ్స్, మహాదేవ్ విగ్రహాంతో తేరును లాగడం ఈసారి ప్రేత్యకత సంతరించుకుంది. అగ్నిగుండంలో 200 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉమామహేశ్వర ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ చైర్మన్ అంతటి రజితమల్లేష్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేజీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండికారి బాలజీ, భ్రమరాంబ దేవాలయం కమిటీ అధ్యక్షుడు శ్రీధర్, కేతేపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నయనానందం.. ప్రభోత్సవం
నయనానందం.. ప్రభోత్సవం


