ముగిసిన ఎత్తంగట్టు బ్రహ్మోత్సవాలు
కోడేరు: మండలంలోని కోడేరు, ఎత్తం మధ్య లో వెలిసిన ఎత్తంగట్టు రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు ఈనెల 14నుంచి ప్రారంభమై శుక్రవారం ముగిశాయి. అర్చకులు మురళీధర్, శ్రీఽ దర్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామలింగేశ్వరస్వామి దర్శనానికి రెండు రాష్ట్రాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొ క్కులు తీర్చుకున్నారు. చిన్న పిల్లలకు తలనీలాలు తీసి స్వామివారికి కొరమీసాలు సమర్పించారు. గట్టుపైకి దారి లేకపోవడంతో భక్తు లు బండరాళ్ళపై పాకుతూ వెళ్లారు. కొందరు భక్తులు స్వామివారివద్దకు వెళ్లలేనివారు కోడేరు వైపు ఉన్న ముఖద్వారం వద్ద తమ మొక్కులు తీర్చుకున్నారు. గట్టుపై మంచుతో కప్పి ఉన్న పొగలు, పచ్చని పొలాలు, సాగునీటి కాల్వలు ప్రకృతి అందాలను చూసి భక్తులు సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. కొండ్రావుపల్లి యువకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ముగిసిన ఎత్తంగట్టు బ్రహ్మోత్సవాలు
ముగిసిన ఎత్తంగట్టు బ్రహ్మోత్సవాలు


