మన్యంకొండ ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
స్టేషన్ మహబూబ్‌నగర్: పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ శ్రీలక్ష్మివేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లోని ఆ యన నివాసంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 1వ తే దీన జరిగే రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వ హించనున్నట్లు సీఎంకు వివరించారు. సీ ఎం సానుకూలంగా స్పందించారని, బ్రహ్మోత్సవా ల్లో సీఎం ఏదైనా ఒక రోజు పాల్గొంటార ని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొన్నారు.


