బస్సు, బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరి దుర్మరణ ం
వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ గేట్ సమీపంలో హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో లారీ అతివేగంగా వచ్చి బైక్‌ను ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్‌కు చెందిన ముద్దమల్ల రాజు(30) మృతిచెందాడు. వెల్దండ ఎస్‌ఐ కురుమూర్తి కథనం ప్రకారం.. హైదరాబాదు నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టి, అచ్చంపేటకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజు ఘటనా స్థలంలోని మృతిచెందాడు. బస్సులోని ప్రయాణికులు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు.
8మంది ప్రయాణికులకు గాయాలు
అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో 19 మంది ప్రయాణికులతో హైదరాబాదు వెళ్తుంది. ఇందులోని కండక్టర్ సుదర్శన్‌తోపాటు నల్గొండ జిల్లా చందంపేట మండలం కాట్రావత్‌తండాకు చెందిన ప్రవీణ్‌కుమార్, అచ్చంపేటకు చెందిన సందీప్, శృతి, వెల్దండ మండలం శంకర్‌తండాకు చెందిన గోపాల్, తాడూర్ మండలం గుంతబండతండాకు చెందిన జగపతి, కల్వకుర్తికు చెందిన సాయిప్రవీణ్, నాగర్‌కర్నూల్ మండలం దేశి ఇటుకల చెందిన అన్వేశ్ గాయపడ్డారు. అన్వేశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు తరలించారు.
వచ్చే నెలలో వివాహం
వంగూర్ మండలం ఎల్లమ్మ రంగాపూర్‌కు చెందిన ముద్దమల్ల రాజు హైదరాబాదులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాడు. శుక్రవారం ఉదయం 6గంటలకు ఇంటినుంచి బైక్‌పై బయలుదేరిన రాజు కల్వకుర్తిలో శివకుమార్ లిప్ట్ అడగడంతో బైక్‌పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజు మృతి చెందాడు. శివకుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రాజుకు గతనెలలోనే పెళ్లిచూపులు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చేనెలలో వివాహం ఉందని బోరును విలపించారు. ఇంతలోనే లోకాన్ని విడిచి వెళ్లినావ అంటూ రోధించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కంటైనర్ డ్రైవర్ యూపీకి చెందిన పురన్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.
గాయపడిన
కండక్టర్ సుదర్శన్
మృతి చెందిన రాజు (ఫైల్)
బస్సు, బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరి దుర్మరణ ం
బస్సు, బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరి దుర్మరణ ం


