నేడు అలంపూర్‌లో పూజలకు విరామం
అలంపూర్: దక్షిణ కాశీ, అలంపూర్ క్షేత్రంలో కొలువుదీరిన శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 17న పూజలకు తాత్కాలిక విరామం ఉంటుందని ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు శ్రీజోగుళాంబ అమ్మవారి ఆల యంలో వార్షిక బ్రహోత్సవాలు జరగనున్నట్లు తెలి పారు. వార్షిక ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీంతో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పూ జలకు తాత్కాలిక విరామం ఉంటుందని, భక్తు లు అమ్మవారి దర్శనానికి రాకుండా సహకరించాలని కోరారు. తిరిగి సాయంత్రం 6.30 గంటల నుంచి ఆలయంలోకి భక్తులకు యథా తథంగా అనుమతి ఉంటుందన్నారు.


