వైభవంగా ఉమామహేశ్వరుడి కల్యాణ ం
అచ్చంపేట/అచ్చంపేట రూరల్: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశర్వ క్షేత్రం దిగువకొండ బోగ మహేశ్వరంలో శుక్రవారం తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఏఓ శ్రీనివాసరావు, చైర్మన్ బీరం మాధవరెడ్డిలు స్వామి వారికి అలంకరణ వస్త్రాలు సమర్పించారు.
పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైలం దేవస్థానం నుంచి మొట్ట మొదటి సారి ప్ర త్యేకంగా పంపించిన పట్టు వస్త్రాలను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు అనురాధ వంశీకృష్ణ దంపతులు పార్వతీ పరమేశ్వరులకు కల్యాణానికి అందజేశారు. నియోజకవర్గంలోని బల్మూర్, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, అచ్చంపేట, వంగూ రు, పదర, చారకొండ మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే దంపతులు గువ్వల అమల బాలరాజు, ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు,బ్రమరాంబ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్,కట్ట అనంతరెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా బ్రహ్మోత్సవాలు
ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రాంతకాల పూజలు నిర్వహించారు. 17న ఉదయం 9 గంటలకు ప్రాతరౌపాసన, బలిహరణము, నీరాజనము, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగము, సాయంత్రం4గంటలకు సాయమౌపాసము, సభాపూజ, బలిహరణము, నీరాజనము, అశ్వవాహనము, మంత్రపుష్పము, నిర్వహించనున్నారు.


