మహబూబ్‌నగర్‌కు మరో గెలుపు
మహబూబ్‌నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్‌లో భా గంగా సంగారెడ్డిలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్ లో మహబూబ్‌నగర్ జట్టు విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో మెదక్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ 19 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. జట్టులో కుసుమ విఘ్నేష్ 33 పరుగులు, లోహిత్‌రెడ్డి 27 పరుగులు చేశారు. పాలమూరు బౌలర్లు మహ్మద్ షాదాబ్ అహ్మద్ 4 వికెట్లు, రాకేష్‌నాయక్ 2, తేజావత్ హరీష్, వెంకటచంద్ర చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్ 11.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ డేవిడ్ క్రిపాల్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 పరుగులు, ఎ.శ్రీకాంత్ నాయక్ 22 పరుగులు, ఆకాష్ వెంకట్ 20 పరుగులు చేశారు. లీగ్ మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన మహ్మద్ షాదాబ్ అహ్మద్ (మహబూబ్‌నగర్)కు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రూ.5వేల చెక్ అందజేసి క్రీడాకారుడిని అభినందించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యద ర్శి ఎం.రాజశేఖర్, కాకా వెంకటస్వామి మెమోరియ ల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్ ఆర్గనైజర్ ఆగంరావు, రాజేందర్‌రెడ్డి, కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు.


