కనులపండువగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటంలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యాయి. 15న స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. 16న బ్రహ్మో త్సవాల్లో భాగంగా వారికి వేదపండితులు వివిధ ప్రాంతాలను నుండి వచ్చిన భక్తులు, ప్రజల మధ్య రాత్రి 9గంటలకు ఆలయ ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో స్వామివారికి కనుల పండువగా కల్యానోత్సవం నిర్వహించారు. కల్యాణానికి ముందు స్వామి వారికి వేదపండితులు అభిషేక మహో త్సవం, బ్రహ్మోత్సవ సంకల్పం, గణపతి పుణ్యావచనం, రుత్విక్‌వరణం, నవగ్రహ, వాస్తుసర్వతోభ ద్ర, అంకురారోవణ, ధ్వజారోహణ, అగ్నిపత్రిష్టా వనాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి మోహినీ అలంకరణ అశ్వవాహన సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారికి క ల్యాణోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆల య ఫౌండర్ చైర్మన్ ఆదిత్య లక్ష్మణ్‌రావు, సర్పంచ్ యాదన్నగౌడ్, ఉప సర్పంచ్ సాయికృష్ణాగౌడ్, ఆల య అధికారులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.


