భూమి కేటాయించాలి
డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటుకు
పాలమూరు: మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో నూతనంగా డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడానికి భూమి కేటాయించడంతో పాటు భవనం నిర్మాణానికి సహకరించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్ గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి ఎలాంటి లాభాపేక్ష లేకుండా అపత్కాలంలో పేదలకు సేవ చేస్తున్న రెడ్‌క్రాస్‌కు డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల పేదలకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆధునాతన భవన నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు చేయడానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.


