
చిన్నచింతకుంట: పేదల తిరుపతి అమ్మాపురం కురుమూర్తి కొండ శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం వివిధ ప్రాంతాల భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు మెట్లమార్గంలో గోవింద నామస్మరణ చేస్తూ దర్శనానికి బారులు తీరారు. అలువేలుమంగ, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాల్లోనూ రద్దీ కనిపించింది. జాతర మైదానంలోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.

రాజగోపురం వద్ద దీపాలు వెలిగిస్తున్న భక్తులు