33 పార్లమెంట్‌ స్థానాలు కావాలె.. | - | Sakshi
Sakshi News home page

33 పార్లమెంట్‌ స్థానాలు కావాలె..

Jun 1 2023 1:20 AM | Updated on Jun 1 2023 1:20 AM

- - Sakshi

జడ్చర్ల టౌన్‌: కేంద్ర ప్రభుత్వ పాలనలో ఇటు ప్రాజెక్టులు, అటు పార్లమెంట్‌ స్థానాల పెంపు రెండింటా అన్యాయానికి గురవుతున్నామని రాష్ట్ర ఎకై ్సజ్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం మండలంలోని కోడ్గల్‌లో జరిగిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో కొందరు ఎంపీలు పార్లమెంట్‌లో అడిగితే ఇచ్చేది లేదంటూ సమాధానమిచ్చారని విమర్శించారు. గతంలో జాతీయ హోదా ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టులకు అన్యాయం చేయడంతోపాటు 2026లో జరిగే పార్లమెంట్‌ స్థానాల పెంపులోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అనేక మార్లు భౌగోళికంగా జిల్లాలు, మండలాల ఆధారంగా పార్లమెంట్‌ సీట్లు పెంపు జరుపుకొన్నామని, ఇప్పుడు మాత్రం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం వల్ల ఎంతో నష్టం జరుగుతుందన్నారు. ప్రపంచ జనాభాను అరికట్టడంలో దక్షణాది రాష్ట్రాల ప్రజలు పూర్తిగా నిబంధనలు పాటించడం వల్లే జనాభా తగ్గగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిందన్నారు. తెలంగాణలో 33 జిల్లాలకు గాను 33 పార్లమెంట్‌ స్థానాలు కావాలన్నారు. అప్పుడేమో రూ.వెయ్యి నోట్లు రద్దు చేసిండ్రు.. ఎందుకు చేసిండ్రో దాని వల్ల వచ్చిన లాభమేందో ఇప్పటికీ చెప్పలే.. ఇప్పుడేమో రూ.2 వేల నోట్లు రద్దు చేసిండ్రని, అది ఏం ప్రయోజనం ఆశించి చేశారో చెప్పడం లేదని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే నోట్ల రద్దు చేశారని దుయ్యబట్టారు. నాడు రైతుల పరిస్థితి చూస్తే ఎంతో బాధ కలిగేదని, కరెంట్‌ ఉంటే నీళ్లుండవ్‌.. నీళ్లుంటే కరెంట్‌ ఉండేది కాదన్నారు. అప్పట్లో 100 ఎకరాలున్న రైతులకు పిల్లనివ్వడానికి వెనకాడేవారని, ఇప్పుడు 10 ఎకరాలుంటే చాలు కోటీశ్వరులేనన్నారు.

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సవాల్‌

తాను ఎమ్మెల్యేగా ఉన్న తొమ్మిదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని సామాన్య ప్రజలు చెబితే ఎన్నికల బరి నుంచి తప్పుకొంటానని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. మా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని ఓ పెద్దాయన మాట్లాడారని, ఆయన చెప్పినట్లుగా వారి ఎమ్మెల్యే ల హయాంలో అభివృద్ధి జరిగిందో.. నా హయాంలో జరిగిందో తేల్చుకుందామన్నారు. కార్యక్రమా నికి జెడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య అధ్యక్షత వహించగా.. గిరిజన కార్పొరేషన్‌ అధ్యక్షుడు వాల్యానాయక్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్‌ శివకుమార్‌, డీఈఓ రవీందర్‌, ఆర్డీఓ అనిల్‌కుమార్‌, ఎంఈఓ మంజులాదేవి, సర్పంచ్‌ మమతారెడ్డి పాల్గొన్నారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకేరూ.2 వేల నోట్ల రద్దు

రాష్ట్ర ఎకై ్సజ్‌, క్రీడాశాఖ

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement