వెల్లివిరిసిన మత సామరస్యం | - | Sakshi
Sakshi News home page

వెల్లివిరిసిన మత సామరస్యం

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు

తొర్రూరు: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. మతాలకు అతీతంగా వినాయక లడ్డూను ముస్లిం దంపతులు వేలం పాటలో దక్కించుకున్నారు. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో బుధవారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో పాల్గొన్న ముస్లిం దంపతులు షేక్‌ దర్గా హుస్సేన్‌, రజియా బేగం ఏకంగా రూ.85,516 వెచ్చించి లడ్డూను సొంతం చేసుకున్నారు. వినాయక ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు వేలంలో లడ్డూ దక్కించుకుని హిందూ– ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు. వారిని ఉత్సవ కమిటీ ప్రతినిధులు సత్కరించారు.

మానుకోట పట్టణంలో..

మహబూబాబాద్‌ అర్బన్‌: తొమ్మిది రోజులపాటు గణేష్‌ మండపాల్లో గణనాథులకు పూజలు నిర్వహించిన నిర్వాహకులు లడ్డూల వేలం పాటలను ఉత్సాహంగా నిర్వహించారు. మానుకోట పట్టణంలోని బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి సన్నిధిలో నిర్వాహకులు లడ్డూవేలం పాట నిర్వహించగా షేక్‌ అజారుద్దీన్‌ రూ.70,016కు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement