గూడూరు: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి, మందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంత రం 0నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. తర్వాత రిజిస్టర్లు పరిశీలించారు. నిమజ్జన వేడుకల దృష్ట్యా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యుడు పవన్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
కొత్తగూడ: సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా పీహెచ్‌ిసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. మండలకేంద్రంలోని పీహెచ్‌సీని బధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు పీహెచ్‌సీలో 24గంటల వైద్యం అందాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, లేదంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. రిజిస్టర్లు, మందులను తనిఖీ చేశారు. బాలింతలు, గర్భణుల వివరాలను తెలుసుకున్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు.
డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్


