● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేంగం పెంచాలని, అంకితభావంతో సేవలు అందించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించి మాట్లాడారు. పెండింగ్ దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేదని లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
కొన్ని వినతులు పరిశీలిస్తే..
● డోర్నకల్ మండలం బంజర గ్రామానికి చెందిన కొంత మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు.. తమ ఇళ్ల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు నాసిరకం మెటీరియల్ ఉపయోగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వినతి ఇచ్చారు.
● వినియోగదారుల ఫోరం జిల్లా చైర్మన్ సుధాకర్‌కు కలెక్టరేట్‌లో ఒక గది కేటాయించాలని సీనియర్ జర్నలిస్టు మట్టూరి నాగేశ్వర్‌రావు వినతిలో పేర్కొన్నారు.


