విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలి

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

డీఈఓ సత్యనారాయణమూర్తి

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచాలని డీఈఓ సత్యనారాయణ మూర్తి అన్నా రు. మానుకోట మున్సిపాలిటీ పరిధి అనంతారం మోడల్‌ స్కూల్‌లో ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. శిక్షణలో అందించిన బోధన పద్ధతులు, టీచింగ్‌–లెర్ని ంగ్‌ మెటీరియల్‌ను ప్రతీరోజు తరగతి గదిలో వినియోగించాలన్నారు. ప్రతీ విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికతో బోధించాలన్నారు. తెలుగు, గణితం, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ల నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రంథాలయం, సైన్స్‌ల్యాబ్‌, ఏటీఎల్‌ ల్యాబ్‌లు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా సైన్స్‌ అధికారి అప్పారావు, రిసోర్స్‌పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement