● ఓటాయి గ్రామంలో
వరుణ యాగం
కొత్తగూడ: వర్షాలు కురవాలని మండలంలోని ఓటాయి గ్రామ ప్రజలు సోమవారం వరుణ యాగం నిర్వహించారు. భానుప్రసాద శాస్త్రి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. మహిళలు బిందెలతో నీరు తీసుకొచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. వర్షాలు కురవాలని ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్టి రాములు, గ్రామ స్తులు సారంగపాణి, మహేందర్, మల్లేష్, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గోరింటాకు సంబురం
ఆషాఢమాసం సందర్భంగా మహిళలు గోరింటాకు సంబురాలు జరుపుకుంటున్నారు. కాగా, సోమవారం జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురంకాలనీకి చెందిన మహిళలు ఒకచోటచేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకొని సంతోషం వ్యక్తం చేశారు. –మహబూబాబాద్ అర్బన్
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మాధవి
మరిపెడ రూరల్: తెలంగాణ జాగృతి రాష్ట్ర నూతన అధ్యక్షురాలిగా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన మారిపల్లి మాధవిని నియమించినట్లు జాగృతి చీఫ్, సంస్థ ఫౌండర్ కల్వకుంట్ల కవిత సోమవారం ప్రకటించారు. నూతన అధ్యక్షురాలు సారథ్యంలో జాగృతి తన లక్ష్యాల వైపు మరింత బలంగా పయనిస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన కల్వకుంట్ల కవితకు మాధవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


