డిజిడల్‌ | - | Sakshi
Sakshi News home page

డిజిడల్‌

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026

సాక్షి, మహబూబాబాద్‌: మారుతున్న కాలంతో పాటు బోధన విధానం మారాలి. ఇందుకోసం కృత్రిమ మేధా(ఏఐ)ను వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నారు. ఇందు కోసం జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు ట్యాబ్స్‌, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఐఎఫ్‌బీ ప్యానెల్‌ బోర్డులు, కంప్యూటర్లు మంజూరు చేశారు. అయితే వీటిని సద్వినియోగం చేసుకొని బోధించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. గత ఏడాది వరకు కంప్యూటర్‌ బోధకులను నియమించలేదు. ఇప్పుడు నియమించినప్పటికీ.. జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, గూడూరుతోపాటు ఇతర ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ లేక కొన్నిచోట్ల, వాటిని ఎలా ఉపయోగించాలో తెలి యక మరికొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వంటి కారణాలతో జిల్లాలో 20శాతం పాఠశాలల్లో కూడా కంప్యూటర్‌ విద్యను బోధించడం లేదు.

చివరి నుంచి రెండోస్థానం..

ప్రభుత్వం విద్యకు ఎన్ని కోట్లు కేటాయించినా.. ఎన్ని అధునాతన పరికరాలు కొనుగోలు చేసినా.. జిల్లాలో మాత్రం మెరుగైన విద్య అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. జాతీయ విద్యామండలి అధ్వర్యంలో నిర్వహించిన 2025 పీజీఐడీ నివేదికలో జిల్లా పరిస్థితిని స్పష్టం చేశారు. డిజిటల్‌ విద్యకు 50 మార్కులు కేటాయించి బోధన ఆధారంగా మార్కులు ఇవ్వగా.. 33 జిల్లాల్లో మహబూబాబాద్‌ 32వ స్థానంలో నిల్వడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించకపోవడమే ఇందుకు కారణమని పలువురు అంటున్నారు.

డిజిటల్‌ బోధనపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ బోధన అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అనుగుణంగా ప్రతీ పాఠశాలకు ప్యానల్‌ బోర్డులు, కంప్యూటర్లు అందజేశాం. వీటిని సద్వినియోగం చేసుకుని బోధన జరిపేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఐసీటీ ఆపరేటర్లను నియమించాం. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే కంప్యూటర్‌ విద్య, డిజిటల్‌ బోధనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.

– సత్యనారాయణమూర్తి, డీఈఓ

ఏజెన్సీ బిడ్డలకు అందని డిజిటల్‌ విద్య

మూలన పడుతున్న కంప్యూటర్లు

ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌

ఇవ్వడంలో జాప్యం

ట్యాబ్‌లు, ఐఎఫ్‌బీ ప్యానల్‌

బోర్డులు వృథా

పీజీఐడీ నివేదికలో చివరినుంచి

రెండో స్థానంలో మానుకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement