పెండింగ్‌ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి

Jul 21 2026 1:24 AM | Updated on Jul 21 2026 1:24 AM

ఎస్పీ శబరీష్‌

గార్ల: పెండింగ్‌ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ శబరీష్‌ ఆదేశించారు. సోమవారం గార్ల పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని నేరాల రిజిస్టర్లు, పెండింగ్‌ కేసుల వివరాలు, రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని, ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. గంజాయి, మత్తు పదార్థాలపై పోలీసులు నిఘా పెంచాలని, వీటిని నియంత్రించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను కోరారు. గార్ల–బయ్యారం సీఐ రవీందర్‌ యాదవ్‌, ఎస్సై సాయికుమార్‌, ఏఎస్సై ములుకూరి వెంకట్‌రెడ్డి, సిబ్బంది శ్యామ్‌, దాసు, శ్రీను, శ్వేత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement