మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026

Jul 21 2026 1:24 AM | Updated on Jul 21 2026 1:24 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

మహబూబాబాద్‌ రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో సాగు ముందుకు సాగడం లేదు. వానలు కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో వరిసాగు చాలా వరకు తగ్గింది. అయితే రైతులు తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లా రైతాంగం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాగును మార్చుకోవాలని సూచిస్తోంది.

రైతుల వద్దకు వ్యవసాయ అధికారులు

జిల్లాలో ఇప్పటికే పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ అధికారులు వరి రైతులపై దృష్టి సారిస్తున్నారు. బోర్లు, చెరువుల కింద నార్లు పోసుకున్న రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. నీటి లభ్యత ఉంటే ఈ నెలాఖరు నాటికి వరికి బదులు మొక్కజొన్న సాగు చేయాలని సూచిస్తున్నారు. ఆగస్టు ప్రారంభంనాటికి ఆశించిన వర్షాలు కురవకపోతే పెసర, కందులు, మినుములు, జొన్నలు, సాగు చేయాలంటున్నారు. ఇందుకుగాను వ్యవసాయాధికారులు రైతుల వద్దకే వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.

భారీగా తగ్గనున్న వరి సాగు..

జిల్లాలో ఈ ఏడాది వరి సాగును 65 శాతానికి పరిమితం చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది వానాకాలంలో 2,30,724 ఎకరాల్లో వరి పంట వేయగా.. ఈ సారి 2,18,557 ఎకరాలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు రైతులు 1,53,570 ఎకరాల మేరకు వరినార్లు పోసుకున్నారు. అయితే, నీరు అధికంగా అవసరమవ్వడం, బోరు బావుల్లో నీరు ఇంకిపోవడం వంటి కారణాలతో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది.

25వేల ఎకరాల్లో మిరప..

జిల్లాలో 25 వేల ఎకరాల్లో మిరప పంట సాగు చేస్తారని ఉద్యాన అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని 100 నర్సరీల్లో 100 ఎకరాలకు సరిపోయే విధంగా మిరపనారు సిద్ధం చేశారు. అలాగే రైతులు సుమారు 12,500 ఎకరాల మేరకు మిరప నార్లు పోసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

వరి

21,212

కందులు

888

పెసర

5,227

మినుములు 145

వేరుశనగ

16

పత్తి

86,413

నువ్వులు

12

బొబ్బెర

5

కంది, వేరుశనగ

జొన్న

22

పంట

ఎకరాలు

జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సాగైన

పంటలు

వర్షాలపై అన్నదాతల్లో ఆందోళన

ఇప్పటి వరకు 1,49,280 ఎకరాల్లో

మాత్రమే సాగు

ఆరుతడి పంటలపై వ్యవసాయ అధికారుల అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement