ఉరి వేసుకుని యువకుడి మృతి! | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని యువకుడి మృతి!

May 27 2026 6:08 AM | Updated on May 27 2026 8:21 AM

-

మహబూబాబాద్‌ రూరల్‌: ఉరి వేసుకుని యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని సండ్రాలగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. రూరల్‌ ఏఎస్సై కె.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంగెపు మధు (20) తల్లిదండ్రులు సాయిలు, పద్మ పదేళ్ల క్రితం మృతిచెందారు.

అప్పటి నుంచి ఒంటరితనంతో బాధపడుతున్న మధు హైదరాబాద్‌లో తన అక్క బావ నాగమణి, యాకయ్య వద్ద ఉంటున్నాడు. సండ్రాలగూడెం గ్రామంలో నాగమణి దంపతులు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టగా ఆ ఇంటికి సంబంధించిన బిల్లు పడిందని కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మధు అదే గ్రామానికి చెందిన మిత్రుడితో కలిసి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు.

రాత్రి అయిన ఇంటికి రాలేదు. సోమవారం తెల్లవారు ఉదయం కొందరు వ్యక్తులు మధు గ్రామ శివారులో గల ఓ వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరివేసుకొని మృతిచెంది ఉన్నాడని చెప్పగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి అక్క నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement