మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

Apr 21 2026 4:20 AM | Updated on Apr 21 2026 4:20 AM

మహబూబాబాద్‌: ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అఽధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యాపింగ్‌లో పురోగతి ఉండాలని, అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. బూత్‌స్థాయిలో రాజకీయ పార్టీల ఎజెంట్ల నియామకంపై ఇప్పటికే ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. పార్టీల ప్రతినిధుల సహకారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి వారి పరిధిలో బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుని మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వీసీలో ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement