జనజాతరలో ‘జెన్ జీ’లు
రెండోసారి
స్నేహితులతో వచ్చాం
మేడారం జాతరకు రెండోసారి స్నేహితులతో వచ్చాం. తల్లుల దర్శనం గొప్ప అనుభూతి. ఆదివాసీ సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుస్తాయి. మా తరానికి భక్తితోపాటు ఉల్లాసం ఇక్కడ లభిస్తుంది.
– టి.భరత్‌కుమార్, నవాబుపేట, జనగామ
– ఇగుర్ల రాజ్‌కుమార్, పెద్దపల్లి
–మేడారం
(కాళేశ్వరం)
మేడారానికి పోటెత్తుతున్న నవతరం భక్తితోపాటు రిఫ్రెష్‌మెంట్‌కు మేడారం బాట
తల్లిదండ్రులతో కలిసి వచ్చాం..
సమ్మక్క, సారలమ్మలు మా ఇలవేల్పు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి జాతరకు వస్తున్నా. ప్రస్తుతం అమ్మనాన్న, బంధువులతో వచ్చా. మా అక్కలు, చెల్లెళ్లతో మేడారంలో రీల్స్ చేశాం. వనదేవతలకు మొక్కులు చెల్లించాం. మా తరం ఇలా దర్శనాలు, వనదేవతల మూలాలు తెలుకోవడం ఆనందంగా ఉంది.
– బోదాసు మమత,
హైదరాబాద్
కుటుంబ సమేతంగా..
కుటుంబ సమేతంగా తల్లుల దర్శనానికి వచ్చాం. మాతోపాటు స్నేహితులు ఉన్నారు. తల్లులు వనం నుంచి జనంలోకి రావడం.. దర్శనాల తర్వాత వనప్రవేశం మా తరానికి ప్రత్యేకం. ఆదివాసీల పూజలు, వారి సంప్రదాయాలపై అవగాహన కలిగింది.
మేడారం జాతర అంటే ఒకప్పుడు పెద్దల భక్తి, సంప్రదాయాల ప్రతిరూపంగా మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు దృశ్యం మారుతోంది. 1997–2012 మధ్య జన్మించిన జెన్ జీ తరం మేడారం వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. భక్తితోపాటు రిఫ్రెష్‌మెంట్ కోసం కూడా జాతరకు పరుగులు తీస్తున్నారు. నగరాల్లో పెరిగిన యువతకు ఇది ఒక కొత్త అనుభూతి.
చాలా సంతోషంగా మొక్కులు
రెండేళ్లకోసారి తల్లులను కుటుంబ సమేతంగా దర్శించుకుంటాం. ఆదివాసీల సంప్రదాయాలు, కళలు, ఆధ్యాత్మికతతో మేడారం కొత్తగా మారింది. రవాణా సౌకర్యం మెరుగుపడింది. చాలా సంతోషంగా మొక్కులు చెల్లించాం.
–గరిగే సబిత, హైదరాబాద్
జనజాతరలో ‘జెన్ జీ’లు
జనజాతరలో ‘జెన్ జీ’లు
జనజాతరలో ‘జెన్ జీ’లు


