కేసీఆర్‌ను ముట్టుకుంటే అగ్ని గుండమే
● మాజీ మంత్రి దయాకర్‌రావు
తొర్రూరు రూరల్ : ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్ని గుండమే అవుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వెలికట్ట శివారు ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ..కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహిస్తుందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, పోలీసులకు తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. నాయకులు మర్రి యాదవరెడ్డి, పారుపటి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా సుందర్ రాంరెడ్డి, గాంధీనాయక్, పసుమర్తి సీతారాములు పాల్గొన్నారు.


