బ్లాక్‌లో యూరియా అమ్మితే డీలర్లపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

బ్లాక్‌లో యూరియా అమ్మితే డీలర్లపై చర్యలు

Jan 17 2026 9:01 AM | Updated on Jan 17 2026 9:01 AM

బ్లాక

బ్లాక్‌లో యూరియా అమ్మితే డీలర్లపై చర్యలు

బయ్యారం: ఎరువుల దుకాణాల్లో యూరి యాను బ్లాక్‌లో అమ్మితే సదరు డీలరుపై శాఖాపరమైన చర్యలు తప్పవని డీఏఓ సరిత హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని కొత్తపేట గ్రామంలోని పలు ఎరువుల దుకా ణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. దు కాణాల్లో స్టాక్‌ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి, రికార్డులు అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులకు యూరియా సక్రమంగా అందించాలని సూచించారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి, విస్తరణ అధికారులు ఉన్నారు.

పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి

మహబూబాబాద్‌: ఇంటర్‌ ప్రవేశాలకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసిందని, విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం టీజీ ఎంఆర్‌ఐఈఎస్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026–27 విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ బాలుర, బాలికల కోసం, ఐదో తరగతిలో అడ్మిషన్‌ల కోసం ఈ పోర్టల్‌ను వినియోగించాలన్నారు. రిజిస్ట్రేషన్‌ ఈనెల 16నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ పాఠశాలలు, కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో డీఎంఎంఓ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

గణతంత్ర వేడుకలకు ఆహ్వానం

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మండలంలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన రేపల్లె షణ్ముఖరావుకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలంటూ ఆహ్వానం వచ్చింది. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే తేనీటి విందు (ఎట్‌ హోం)కు ఆహ్వానం అందింది. షణ్ముఖరావు చిన్నతనం నుంచే గ్రామంలో రైతుల విద్యుత్‌ మోటార్లను మరమ్మతులు చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో రైతులకు ఉపయోగపడే పలురకాల యంత్రాలను రూపొందించి, వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో వినూత్నంగా మోనో వీల్‌ వీడర్‌ వాహనాన్ని రూపొందించినందుకు గాను రాష్ట్రపతి భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించింది. ఈమేరకు షణ్ముఖరావును హనుమాన్‌ దేవాలయ కమిటీ చైర్మన్‌ కొలిశెట్టి సత్యనారాయణ, సర్పంచ్‌ చీరిక వసంతఉపేందర్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ కమటం యాకన్న, నీలం రమేష్‌, కొంపెల్లి సుధాకర్‌ రెడ్డి, మలికంటి రమేష్‌, కొంపెల్లి వాసుదేవరెడ్డి, జైపాల్‌ రెడ్డి, ఆర్మీ రాజేష్‌, కమటం వెంకన్న, కొల్లు వెంకట్‌ రెడ్డి, పప్పుల చామంతి తదితరులు అభినందించి ఘనంగా సన్మానించారు.

మున్నేరు ప్రాజెక్ట్‌ నిర్మించాలి

గార్ల: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మున్నేరు ప్రాజెక్ట్‌ నిర్మించి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని మున్నేరు జలసాధన కమిటీ కన్వీనర్‌ గంగావత్‌ లక్ష్మణ్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం గార్లలో కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ ప్రాంత రైతులకు ఒక్క చుక్క నీరు కూడా అందించలేని జీఓ నంబర్‌ 98ను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి, గుంపెళ్లగూడెం గ్రామ సమీపంలో పెండింగ్‌లో ఉన్న మున్నేరు ప్రాజెక్ట్‌ నిర్మించేంత వరకు దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మున్నేరు ప్రాజెక్ట్‌ నిర్మించకుండా దుబ్బగూడెం సమీపంలో మున్నేరుపై డ్యామ్‌ నిర్మించి కాల్వ ద్వారా పాలేరు చెరువుకు నీటిని తరలిస్తే రైతులతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. జలసాధన కమిటీ కోకన్వీనర్లు గౌని ఐలయ్య, కందునూరి శ్రీనివాసరావు, కట్టెబోయిన శ్రీనివాసరావు, జడ సత్యనారాయణ, విశ్వ, జి.సక్రు, రమేశ్‌, సత్యం, మురళి, షఫీ, రామారావు, రాధాకృష్ణ, వెంకన్న, మీగడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్‌లో యూరియా అమ్మితే డీలర్లపై చర్యలు 1
1/2

బ్లాక్‌లో యూరియా అమ్మితే డీలర్లపై చర్యలు

బ్లాక్‌లో యూరియా అమ్మితే డీలర్లపై చర్యలు 2
2/2

బ్లాక్‌లో యూరియా అమ్మితే డీలర్లపై చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement