గోదారంగనాథుల కల్యాణ వైభోగం
గోదారంగనాథుల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమను ఆశీర్వదిస్తున్న అర్చకులు
మహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామివారి దేవాలయంలో గోదారంగనాథుల కల్యాణోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలో శోభాయమానంగా ఏర్పాటుచేసిన వేదిక, ఆదిశేషుడి వాహనంపై గోదారంగనాథులను కొలువుదీర్చి రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి,గోదాదేవి అమ్మవారి కల్యాణోత్సవాన్ని జరిపారు. ధనుర్మాసం సందర్భంగా పూజలు చేసి మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంలో గోదారంగనాథుల కల్యాణం నిర్వహించామని అర్చకులు ముడుంబై లక్ష్మీనారాయణచార్యులు, సత్యంగౌతం మహారాజ్, దత్తుస్వామి తెలిపారు. మ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారు, అమ్మవార్లకు పూజలు చేసి, ప్రజలందరిపై గోదారంగనాథుల అనుగ్రహం ఉండాలని వేడుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో కల్యాణోత్సవ పూజల్లో పాల్గొని స్వామి, అమ్మవారికి పూజలు చేశారు. అర్చకలు భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు చేశారు. కల్యాణం కోసం పూజించిన యువతులకు స్వామి వారి పూలమాలలను అందించారు.
గోదారంగనాథుల కల్యాణ వైభోగం


