మానుకోటలో 101రకాల నోములు
మహబూబాబాద్ రూరల్ : తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ప్రత్యేకమైన వేడుకల్లో సంక్రాతి ఒకటి. ఈ సందర్భంగా నూతన కోడలు సెంటిమెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ జిల్లా కేంద్రంలో ఓ కుటుంబం గురువారం 101 రకాల నోములు ఆచరించి మహిళలకు వాయినాలు ఇచ్చారు. బొడ్ల రామకృష్ణ, నర్మద దంపతుల కుమారుడు జశ్వంత్ సాయి భార్య స్వప్న (కొత్త కోడలు) గౌరీదేవి నోముతో పాటు 101 రకాల నోములను ఆచరించారు. నూతన వివాహితలకు సౌభాగ్యాన్ని, మంచి వైవాహిక జీవితాన్ని, సంతాన సాఫల్యాన్ని ఆశిస్తూ సంక్రాంతి పండుగ సందర్భంగా గౌరీదేవి నోము నిర్వహించామని వారు తెలిపారు. లాలి పాన్పు నోము, అక్కకు అటుకుల నోము, చెల్లెలికి శనిగల నోము, పంచాక్షరి నోము తదితర 101 నోములను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. నోము అనంతరం 101 మంది ముత్తైదువులకు వాయినాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి, విందు భోజనాలు ఏర్పాటు చేశారు.
మానుకోటలో 101రకాల నోములు


