పనులు త్వరగా పూర్తి చేయాలి | Sakshi
Sakshi News home page

పనులు త్వరగా పూర్తి చేయాలి

Published Fri, May 24 2024 9:55 AM

పనులు త్వరగా పూర్తి చేయాలి

మహబూబాబాద్‌: అమ్మ ఆదర్శ పాఠశాలల పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తవ్వాలన్నారు. ఎంపీడీఓలు, డీఈలు, ఏఈలు దగ్గరుండి పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లాలో 438 పాఠశాలలు ఎంపిక కాగా, 432 గ్రౌండింగ్‌ అయ్యాయని, మిగతావి రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. పాఠశాలల రూపురేఖలు మార్చేవిధంగా హెచ్‌ఎంలు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నర్మద, డీఈఓ రామారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి..

జూన్‌ 3నుంచి 13వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి పదో తరగతి సప్లిమెంటరీ, ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30నుంచి 12.30గంటల వరకు జరిగే పరీక్షలకు 591మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపా రు. సెంటర్ల చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా ఆయా శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ చెన్నయ్య, డీఈఓ రామారావు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement