
అట్రాసిటి కేసు నమోదు చేయాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్‌లో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళను మానసికంగా వేధింపులకు గురిచేసిన డీఈఓ రామారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్‌నాయక్ అన్నారు. హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషనర్ కార్యాలయంలో గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్‌కు ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పార్వతిని అకారణంగా విధుల నుంచి తొలగించి, తోటి ఉద్యోగస్తులు ఆమెతో మాట్లాడొద్దని హుకుం జారీ చేయండం ఏమిటని ప్రశ్నించారు. డీఈఓను వెంటనే సస్పెండ్ చేసి పార్వతి ఉద్యోగం రెన్యూవల్ చేయాలన్నారు. అలాగే గూడూరు ఉద్యోగి నీలను యథావిధిగా ఉద్యోగంలోకి తీసుకోవాలన్నారు. హుస్సేన్‌నాయక్ స్పందించి పార్వతికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర, జిల్లా నాయకురాలు పద్మాబాయి, లక్ష్మి, దేవి, బాధితులు పార్వతి, నీల తదితరులు పాల్గొన్నారు.