కోసిగిలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన | - | Sakshi
Sakshi News home page

కోసిగిలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

కోసిగి: మండల కేంద్రమైన కోసిగిలో టీడీపీ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. కొత్త బోరు ఏర్పాటు చేయడంపై వైఎస్సార్‌సీపీ జెడ్‌పీటీసీ అభ్యర్థి పాలేగర్‌ శ్యాంసుందర్‌ రాజు దొర, మాజీ ఎంపీపీ ఈరన్న, మండల నాయకులు నాడుగేని నాగరాజు, దళవాయి మంగమ్మలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కోసిగిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా తాగునీటి సమస్య టీడీపీ నాయకులకు కనిపించలేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల వేళ ఓటర్లను మభ్య పెట్టేందుకు తాగునీటి బోరు వేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లోకరాజుకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గానిగ వీరస్వా మి, కాంట్రాక్టర్‌ నాగరాజు, బుళ్లి నరసింహులు, కొరివి నాగరాజు, ప్రవీణ్‌ కుమార్‌, కట్టెల నరసింహులు, కాల్వ లక్ష్మయ్య, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement