ఒకే ఇంట్లో ఉన్న వారికి వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో ఉన్న వారికి వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలు

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

తికమకకు గురైన ఓటర్లు దొంగ ఓట్లు వేసిన టీడీపీ నాయకులు ● సీపీఎం నాయకుల నిరసన కర్నూలు జిల్లాలో మరో ఆరు కరువు మండలాలు

కర్నూలు (అర్బన్‌): కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఆదివారం జరిగిన పోలింగ్‌లో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా వారి ఓట్లు మాత్రం వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో నమోదయ్యాయి. జిల్లాపరిషత్‌ రిటైర్డ్‌ సీఈఓ జి.జయపాల్‌రెడ్డి కుటుంబం నంద్యాల రోడ్డులోని మారుతీ మెగా సిటీ సమీపంలో నివాసం ఉంటోంది. జయపాల్‌ రెడ్డి, ఆయన సతీమణి ఓట్లు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉండాలి. అయితే జయపాల్‌ రెడ్డి సతీమణి ఓటు నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని కేంద్రీయ విశ్వ విద్యాలయం పోలింగ్‌ స్టేషన్‌లో ఉండగా ఆయన ఓటు నందికొట్కూరు రోడ్డులోని సోమిశెట్టి నగర్‌ గుడ్‌షెప్పర్డ్‌ స్కూల్‌లో నమోదైంది. ఇలాంటి సంఘటనలు కర్నూలు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకోవడం గమనార్హం.

పోలింగ్‌ కేంద్రంలో

టీడీపీ అభ్యర్థి హల్‌చల్‌

కర్నూలు(సెంట్రల్‌): కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ అభ్యర్థి పెరుగు పురుషోత్తంరెడ్డి హల్‌చల్‌ చేశారు. ఇక్కడ పోలీసులు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కూడా లోపలకు పంపలేదు. జనరల్‌ ఏజెంట్‌ మహేశ్వరరెడ్డిని మూడో పట్టణ పోలీసులు ఉదయం 8.30 గంటలకే అరెస్టు చేసి తీసుకెళ్లారు. మరోవైపు క్యూలైన్లో నిలబడిన ఓటర్లను సైతం పురుషోత్తంరెడ్డి తనకు ఓటు వేయాలని అభ్యర్థించాడు.

కర్నూలు(సెంట్రల్‌): టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేస్తుండటంతో కర్నూలు 30వ వార్డులో సీపీఎం నేతలు నిరసన తెలిపారు.ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో వారు పోలీసులను తీరును తప్పుబట్టారు. దీంతో పోలీసులు సీపీఎం నాయకులను అక్కడి నుంచి పంపారు. ఇదే సమయంలో ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ అక్కడికి రావడంతో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ ఆయన తో మాట్లాడారు. ఎస్పీ చొరవ తీసుకుని అక్కడ ఉన్న టీడీపీ నాయకులందరినీ పంపడంతో సీపీఎం నాయకులు శాంతించారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి

ఆలూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకులు రౌడీయిజం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తరఫున గుమ్మనూరు గ్రామంలో ప్రచారం చేస్తున్న అదే పార్టీ కార్యకర్త సురేష్‌పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. తలకు, వీపుకు, చేతికి గాయాలయ్యాయి. గాయపడిన సురేష్‌ను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాడి చేసిన టీడీపీ నాయకులపై చిప్పగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో మరో ఆరు మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభు త్వం ఉత్వర్వులు జారీ చేసింది. జిల్లాలోని 27 మండలాలను కరువు ప్రాంతంగా గుర్తించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. అయితే కేవలం 15 మండలాలను మాత్ర మే గుర్తించారు. జిల్లాలోని 12 మండలాల్లో కనీవినీ ఎరుగని రీతిలో కరువు ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంపై ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 21న మరో ఆరు మండలాల ను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని కోరు తూ జిల్లా కలెక్టర్‌ సిరి ప్రభుత్వానికి నివేదిక పంపా రు. జిల్లా కలెక్టర్‌ పంపిన నివేదికను పురస్కరించుకొని ఆస్పరి, నందవరం, ఆదోని– 2, కోసిగి, మంత్రాలయం, కల్లూరు మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ జీవో జారీ అ య్యింది. దీంతో జిల్లాలో కరువు మండలాల సంఖ్య 21కి పెరిగింది. కౌతాళం, ఎమ్మిగనూరు, సీ బెళగల్‌, గోనెగండ్ల, దేవనకొండ, పెద్దకడుబూరు మండలాల్లో తీవ్ర కరువు ఉన్నప్పటికీ ప్రభుత్వం పక్కన పెట్టడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement